schedule Tuesday, November 03, 2026

పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా?

calendar_today October 30, 2026
person dharshininews
పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా?
పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా? - గాంధీనగర్‌ చెత్త సమస్య పరిష్కారంపై సంతోష్‌ గౌడ్‌ ఫైర్ - ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించాం తాండూరు, దర్శిని ప్రతినిధి: గాంధీనగర్‌లో పదేళ్లుగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు తాము చొరవ తీసుకుంటే, పనులు పూర్తయ్యాక వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఏమిటని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సంతోష్‌ గౌడ్‌ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎవరి పాత్ర ఏమిటో కాలనీవాసులకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీనగర్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న చెత్త సమస్యను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన స్పందనతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో చెత్త తొలగింపు పనులు చేపట్టినట్లు సంతోష్‌ గౌడ్‌ తెలిపారు. గతంలో పరిష్కారం కాని సమస్యను ఇప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. "హంగూ ఆర్భాటాలు.. ప్రచారాలు కాదు, ప్రజలకు పనికొచ్చే అభివృద్ధే ముఖ్యం" అని స్పష్టం చేశారు. తాము పనులు చేస్తుంటే వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. పనిచేసే నాయకుడెవరో, ప్రజల సమస్యల కోసం నిలబడేది ఎవరో కాలనీవాసులే నిర్ణయిస్తారని అన్నారు. గాంధీనగర్‌ అభివృద్ధి, కాలనీవాసుల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ప్రచారం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యం ఇస్తామని సంతోష్‌ గౌడ్‌ పేర్కొన్నారు. https://www.dharshininews.com/45230/