పట్టభద్రుల ఓటరు నమోదులో ఉపాధ్యాయులు చొరవ చూపాలి
October 30, 2026
dharshininews
పట్టభద్రుల ఓటరు నమోదులో ఉపాధ్యాయులు చొరవ చూపాలి
- అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
- ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కోరారు.
శుక్రవారం తాండూరు పట్టణంలోని నేతాజీ గురుదేవ్ గురుకుల్, గంగోత్రి విద్యాలయ, సెయింట్ మార్క్స్ స్కూల్, సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్, అక్షర కాన్సెప్ట్ స్కూల్‌ల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన అంశమని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు తమ పరిధిలోని పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నాయకులు, పార్టీ నాయకులతో పాటు ఆయా పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45232/