schedule Friday, September 04, 2026

తాండూరులో బీఎండబ్ల్యూ స్కూటీ...!

calendar_today December 22, 2021
person dharshininews
తాండూరులో బీఎండబ్ల్యూ స్కూటీ...!
తాండూరులో బీఎండబ్ల్యూ స్కూటీ...! - రూ.12లక్షలకు కొనుగోలు చేసిన ప‌ట్ట‌ణ వాసి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భారత్లో అత్యంత ఖరీదైన, పవర్ఫుల్ స్కూటర్ రికార్డు సృష్టించిన బీఎండబ్ల్యూ స్కూటీ తాండూరులో సందడి చేస్తోంది. తాండూరుకు చెందిన బ‌బ్ల్యూ ఠాకూర్ అనే వ్య‌క్తి దీనిని కొనుగోలు చేశారు. ఈ యేడాది అక్టోబర్‌లో లాంచింగ్ అయిన ఈ బైకును బ‌బ్ల్యూ ఠాకూర్ రూ. 12లక్షల 50 వేలకు కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి ఎన్నో ప్రత్యేకతలో కారు అయినా.. బైకు అయినా విడుదల చేస్తుంది. ఆ కంపెనీ నుంచి స్కూటీ విడుదల కావడం.. తాండూరులో సందడి చేయడంతో పట్టణ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణలో ఆవిష్క‌రించిన మొద‌టి 100 స్కూటీల‌లో మూడో స్కూటీని కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు. ఇందులో సరికొత్త ఫీచర్స్ ఉన్నాయని బ‌బ్ల్యూ ఠాకూర్ తెలిపారు. అదేవిధంగా స్కూటీ ముందుభాగంలో టెలీస్కోపీక్ ఫోర్కులు, వెనుకబాటు సర్దుబాటు చేయగల డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయని, ముందు భాగంలో -డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుకవైపు సింగల్ డిస్క్ యూనిట్ కలిగి ఉందన్నారు. ఇంజన్ సీవీటీ గేరు బాక్సుతో గరిష్టంగా 139 కిలో మీటర్ల వేగాన్ని కలిగి ఉంటుందని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో బ్లూటూత్ కనెక్టివిటితో పనిచేసే డ్యాష్ బోర్డు, ఆటోమెటిక్ సెబిలిలీ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు.