schedule Wednesday, September 09, 2026

వృత్తి విద్య‌లో నైపుణ్యం సాధించాలి

calendar_today December 30, 2021
person dharshininews
వృత్తి విద్య‌లో నైపుణ్యం సాధించాలి
వృత్తి విద్య‌లో నైపుణ్యం సాధించాలి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - నేష‌న‌ల్ టెక్నోలో ఆక‌ట్టుకున్న ఫుడ్ పెస్టివ‌ల్‌ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యార్థులు చదువుతోపాటు వృత్తి విద్య‌లో నైపుణ్య‌త సాధించాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని నేషనల్ టెక్నో స్కూల్ లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ కు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫుడ్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన ఆహార ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన ఇతర రంగాల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో విద్యార్థులు సాంకేతికంగా మరియు వృత్తి విద్య లోనూ నైపుణ్యం ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నయుం అఫ్ఫూ, సీనియర్ నాయకులు రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, యలాల్ ఎంపీపీ బాలేశ్వర గుప్తా, కౌన్సిలర్లు రఘు, ముక్తార్ నాజ్ పాల్గొన్నారు.