schedule Friday, September 04, 2026

తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి

calendar_today February 9, 2022
person dharshininews
తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి - యాలాలలో టీఆర్ఎస్ నాయకుల నిరసన ర్యాలీ యాలాల, దర్శిని ప్రతినిధి : దేశ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యాలాల టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజనపై మోడీ అనుచిత వ్యాక్యాలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆదేశాల మేరకు యాలాల మండల కేంద్రంలో నాయకులు నిరసన చేపట్టారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని. త్యాగాలను అవమాన పరచారు. మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక అవమానకర వ్యాఖ్యలను చేశారని, తక్షణమే విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు ఆకుల బస్వరాజ్. C.రవీందర్ రెడ్డి, ఎంపిటిసీ లక్ష్మప్ప, సర్పంచ్ ప్రవీణ్ కుమార్, U. అనంతయ్య K. వెంకటయ్య గౌడ్, రఘు, అరవింద్ కుమార్ రెడ్డి, ముస్తఫా, సత్తయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.