schedule Friday, September 04, 2026

గ్రామాల అభివృద్ధికి నిధులివ్వండి

calendar_today March 11, 2022
person dharshininews
గ్రామాల అభివృద్ధికి నిధులివ్వండి
గ్రామాల అభివృద్ధికి నిధులివ్వండి - ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్ పర్సన్ల నాయకులు - కరణం పురుషోత్తంరావు ఆధ్వర్యంలో భేటి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డిలను టీఆర్ఎస్ నాయకులు కోరారు. శుక్రవారం యాలాల మండల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు ఆధ్వర్యంలో మండలంకు చెందిన పలువురు ఎంపీటీసీలు, నాయ‌కులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి భేటి అయ్యారు. మండలంలోని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు జెడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ, ఎంపీ కోటాల కింద నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్ పర్సన్లు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా కరణం పురుషోత్తం రావు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, నాయకులు జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలను శాలువా పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మసూద్, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.