schedule Friday, September 04, 2026

అయ్య‌ప్ప దేవాయ‌లానికి యు.ర‌మేష్ కుమార్ చేయూత‌

calendar_today March 19, 2022
person dharshininews
అయ్య‌ప్ప దేవాయ‌లానికి యు.ర‌మేష్ కుమార్ చేయూత‌
అయ్య‌ప్ప దేవాయ‌లానికి యు.ర‌మేష్ కుమార్ చేయూత‌ - సీసీ కెమ‌రాల కోసం రూ.51 వేల విరాళం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయానికి బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆర్థిక చేయూత‌నందించారు. శనివారం అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించిన యు. రమేష్ కుమార్ ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను కలిసి రూ. 51 వేల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తం ఈ విరాళం అందించినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి కృప పట్టణ ప్రజలపై ప్రార్థించినట్లు తెలిపారు. మ‌రోవైపు ఆల‌యానికి విరాళం అందించిన యు.ర‌మేష్ కుమార్‌ను ఆల‌య క‌మిటి స‌భ్యులు శాలువాతో స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు వెంకటరావు, గాజుల బస్వరాజ్, నరహరి, ప్రవీణ్ గౌడ్, బీజేపీ నాయకులు పూజారి పాండు, రాం సాగర్ తదితరులు ఉన్నారు.