schedule Friday, September 04, 2026

పాహి.. రామప్రభో..!

calendar_today April 10, 2022
person dharshininews
పాహి.. రామప్రభో..!
పాహి.. రామప్రభో..! - సీతారాములను దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - జుంటుపల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు - తాండూరులో పట్టు వస్త్రాల సమర్పణ తాండూరు, దర్శిని ప్రతినిధి: పాహీ.. రామప్రభో... అంటూ శ్రీ సీతారాములను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం శ్రీరామ నవవి సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరానగర్, సీసీఐ కాలనీ, స్టేషన్ హానుమాన్, సీతారం పేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు యాలాల మండలం జుంటుపల్లిలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని స్టేషన్ హానుమాన్ దేవాలయంలో సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. జుంటుపల్లిలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధికి సహాకారం అందిస్తామని. అన్నారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, దేవాలయాల చైర్మన్లు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.