schedule Friday, September 04, 2026

చలివేంద్రాల సేవ ఆదర్శనీయం

calendar_today April 10, 2022
person dharshininews
చలివేంద్రాల సేవ ఆదర్శనీయం
చలివేంద్రాల సేవ ఆదర్శనీయం - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వేసవిలో బాటసారులు, ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేసి సేవలందించడం ఆదర్శనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య యువజన సంఘం సంఘం ఆధ్వర్యంలో నెహ్రు గంజ్, పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాలను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమ‌ళ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండుటెండలతో అల్లాడే ప్రజలకు చలివేంద్రాల ద్వారా దాహార్తిని తీర్చడం గొప్ప సేవ అని కొనియాడారు. ఆర్యవైశ్య యువజన సంఘం సేవలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళీ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, నగరేశ్వరాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, సభ్యులు కోటిక శ్రీకాంత్, కోట్రిక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.