రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
April 11, 2022
dharshininews
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
- కేంద్రపై ఎజెండా తయారిపై చర్చ..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. సోమవారం నిరసన దీక్ష తరువాత సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. రేపు ఏర్పాటు చేసే సమావేశంలో కేంద్రానికి ఇచ్చిన గడువు పూర్తయితే చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
.