schedule Monday, September 07, 2026

రేపు జాబ్ మేళా..!

calendar_today April 15, 2022
person dharshininews
రేపు జాబ్ మేళా..!
రేపు జాబ్ మేళా..! - వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వ‌హ‌ణ వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలోని నిరుద్యోగ యువ‌త‌కు జిల్లా ఉపాధి క‌ల్ప‌నా శాఖ అధికారులు శుభ‌వార్త చెప్పారు. రేపు శ‌నివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాల‌య ఆధ్వ‌ర్యంలో అదే కార్యాల‌యంలో జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఉపాధి క‌ల్ప‌నాధికారి ఎస్ఏ సుభాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అపోలో ఫార్మ‌సీ ప్రైవేటు కంపెని, ఇత‌ర కంపెనీలు జాబ్ మేళా నిర్వహిస్తార‌ని చెప్పారు. 10వ త‌ర‌గ‌తి, ఆ పై చ‌దువులు చ‌దివిన వారు, డీ ఫార్మ‌సీ, బీ పార్మ‌సీ, ఎం పార్మ‌సీ అభ్య‌ర్థులు అర్హుల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ జాబ్ మేళాల‌లో దాదాపు 200 మంది సిబ్బందిని ఎంపిక చేస్తార‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని జిల్లాలోని యువ‌తీ, యువ‌కులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.