schedule Saturday, September 12, 2026

తాండూరుకు సబ్ కోర్టు తీసుక‌వ‌స్తాం

calendar_today April 26, 2022
person dharshininews
తాండూరుకు సబ్ కోర్టు తీసుక‌వ‌స్తాం
తాండూరుకు సబ్ కోర్టు తీసుక‌వ‌స్తాం - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరుకు స‌బ్ కోర్టు, అద‌న‌పు కోర్టు తీసుక‌వచ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని న్యాయవాదులు సంఘం(బార్ అసోసియేష‌న్) అధ్యక్షులు మఠం చంద్రశేఖర్ ఆధ్వ‌ర్యంలో ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, సహా కార్యదర్శి రజిత, కోశాధికారి నాదిర్గే సుదర్శన్ త‌దిత‌రులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. న్యాయ‌వాదుల స‌మ‌స్య‌లు, డిమాండ్ల‌ను అసోసియేష‌న్ స‌భ్యులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సబ్ కోర్టుతో పాటు అదనపు కోర్టు ఏర్పాటుకు తమవంతు ప్రయత్నం చేస్తామ‌ని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని వెళ్తానని సబ్ కోర్టు ఏర్పాటు దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.