schedule Saturday, September 12, 2026

పండ‌గ‌లా టీఆర్ఎస్ ఫ్లీన‌రీ..!

calendar_today April 27, 2022
person dharshininews
పండ‌గ‌లా టీఆర్ఎస్ ఫ్లీన‌రీ..!
పండ‌గ‌లా టీఆర్ఎస్ ఫ్లీన‌రీ..! - వాడవాడలా ఎగరిన గులాబీ జెండా - ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలో టీఆర్ఎస్ ప్లీన‌రీ పండగలా జరిగింది. బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మల్యే రోహిత్ రెడ్డిల ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో గులాబీ జెండాలను ఆవిష్కరించారు. 21వ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్కించుకుని పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులతో కలిసి జెండాను ఎగురవేశారు. 29వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ ర‌వూఫ్‌ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ రాష్ట్ర‌ నాయకులు కరణం పురుషోత్తం రావు పార్టీ నాయకులు మసూద్ తో కలిసి జెండా ఎగురవేశారు. 20వ వార్డులో పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, 13వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్ పార్టీ నాయ‌కులు రాజుగౌడ్‌తో క‌లిసి జెండా ఎగుర‌వేశారు. 24వ వార్డులో వార్డు కమిటీ అధ్యక్షులు కమలాకర్ భద్రేశ్వరాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ బంటారం సుధాకర్‌తో కలిసి జెండా ఆవిష్కరించారు. 33వ వార్డులో కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, 4వ వార్డులో కౌన్సిలర్ అస్లాం, 32వ వార్డులో మాజీ కౌన్సిలర్ సుమిత్ ఆధ్వర్యంలో వార్డు ప్రెసిడెంట్ శివానంద్ గులాబీ జెండాలను ఎగురవేశారు. మరోవైపు పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సీనియర్ నాయకులు పట్లోళ్ల‌ నర్సింలు, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.