schedule Saturday, July 04, 2026

అందరిని ఆదరించు భద్రేశ్వరా.!

calendar_today April 27, 2022
person dharshininews
అందరిని ఆదరించు భద్రేశ్వరా.!
అందరిని ఆదరించు భద్రేశ్వరా.! - దర్శించుకున్న వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు - సన్మానించిన కమిటీ చైర్మన్ బంటారం సుధాకర్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భ‌క్తుల‌ను, తాండూరు ప్రాంత ప్రజలందరిని ఆదరించు భద్రేశ్వరా అంటూ పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర స్వామిని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు వేడుకున్నారు. బుధవారం భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ బంటారం సుధాకర్ కమిటీ ఆధ్వర్యంలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలును ఘనంగా సన్మానించారు. అనంతరం దీపా నర్సింలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లు జాతర ఉత్సవాలు జ‌రుపుకోలేక‌పోయామ‌న్నారు. స్వామి కృపతో ఈ సారి జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయన్నారు. భద్రేశ్వరుని దయ తాండూరు ప్రాంత ప్రజలపై, భక్తులపై ఉండాలని, స్వామి అందరిని ఆదరించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బంటారం లావణ్య, అంతారం లలిత, టీఆర్ఎస్ పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి మాధవి తదితరులు ఉన్నారు.