schedule Saturday, September 12, 2026

ఎమ్మెల్సీ బేషరుతుగా క్షమాపణ చెప్పాలి

calendar_today April 28, 2022
person dharshininews
ఎమ్మెల్సీ బేషరుతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ బేషరుతుగా క్షమాపణ చెప్పాలి - కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వాఖ్య‌ల చేసినందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బేష‌రతుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని తాండూరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్సీ వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూరు పట్టణ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, డీఎస్పీ కార్యాలయ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరలు మాట్లాడుతూ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు సినందుకు ఎమ్మెల్చీ మహేందర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్సీ లక్ష్మీనారాయణను కలిసి ఎమ్మెల్సీపై చర్యలు తీసుకో వాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు వారా అశోక్, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మోయిన్, ఎన్ఎస్ యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.