దారి గోదారయ్యింది..!
May 9, 2022
dharshininews
దారి గోదారయ్యింది..!
- పైపులైన్ లీకేజీతో నీరంతా వృథా
- పదిరోజులైన పట్టించుకోని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని పైపులైన్ లీకేజీల కారణంగా రహదారులు గోదారలవుతున్నాయి. అడిగేవారేలేరన్నట్లుగా అధికారులు చూసి చూడకుండా వదిలేస్తున్నారు. పట్టణంలోని వినాయక్ చౌరస్తా సమీపంలో గత పది రోజుల క్రితం పైపులైన్ లీకేజీకి గురయ్యింది. ఆరోజు నుంచి తాగునీరు సరఫరా సమయంలో నీరంతా వృథాగా పారుతోంది. రోడ్డు మొత్తం నీరంతా నిండి గోదారిగా మారుతోంది. అదే దారిలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికులు పలుమార్లు మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకవచ్చినా మరమ్మత్తులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు పెదవి విరుపు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో.. అదే నిర్లక్ష్య ముద్రను మోసుకుంటారో వేచి చూడాలి.