schedule Friday, September 11, 2026

హోంశాఖ మంత్రిని కలిసిన‌ హన్మంతు

calendar_today May 10, 2022
person dharshininews
హోంశాఖ మంత్రిని కలిసిన‌ హన్మంతు
హోంశాఖ మంత్రిని కలిసిన‌ హన్మంతు - తాండూరు ప‌రిస్థితులపై చ‌ర్చ‌ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని టీఆర్ఎస్ తాండూరు పట్టణ సెల్ అధ్యక్షులు హన్మంతు కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో హోంమంత్రి మ‌హ‌మూద్‌ అలీని మర్యాదపూర్వకంగా క‌లిసి పుష్పగుచ్చం అందించి.. షాలువాతో సన్మానించారు. అనంతరం తాండూరు రాజకీయం, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. అవ‌స‌ర‌మైతే పరిస్థితులను చ‌క్క‌దిద్దేందుకు చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ తెలిపారని హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో పాత తాండూరుకు చెందిన నాయ‌కులు ఖయ్యూం తదితరులు ఉన్నారు.