schedule Saturday, July 04, 2026

మైన‌ర్‌ను గ‌ర్భ‌వ‌తి చేసిన యువ‌కుడి రిమాండ్

calendar_today May 13, 2022
person dharshininews
మైన‌ర్‌ను గ‌ర్భ‌వ‌తి చేసిన యువ‌కుడి రిమాండ్
మైన‌ర్‌ను గ‌ర్భ‌వ‌తి చేసిన యువ‌కుడి రిమాండ్ - వెల్ల‌డించిన క‌ర‌ణ్ కోట్ పోలీసులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండ‌లంలో క‌ల‌క‌లం రేపిన మైన‌ర్ బాలిక ప్ర‌స‌వం ఘ‌ట‌న‌లో నిందితుడిని రిమాండుకు త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని క‌రణ్ కోట్ ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. మండ‌లంలోని జినుగుర్తి గ్రామంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న మైన‌ర్ బాలిక‌ను స్థానిక యువ‌కుడు ఖదీర్ ప్రేమ పేరుతో గ‌ర్బ‌వ‌తి చేశాడు. ఇటీవ‌లే బాలిక ప్ర‌స‌వించ‌డంతో ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ మేర‌కు క‌ర‌న్ కోట్ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. గురువారం నిందితుడిని రిమాండుకు త‌ర‌లించిన‌ట్లు ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి తెలిపారు.