schedule Friday, July 10, 2026

ఆర్టీసీలో మామిడిపండ్ల డెలివరీ

calendar_today May 13, 2022
person dharshininews
ఆర్టీసీలో మామిడిపండ్ల డెలివరీ
ఆర్టీసీలో మామిడిపండ్ల డెలివరీ - ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి - తాండూరు డీపో మేనేజర్ ఆండాలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ఆర్టీసీ డిపోలో ఇంటింటికి మామిడి పండ్ల డెలివరి సేవలను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ పి.ఆండాలు తెలిపారు. ఇటీవల తాండూరు పట్టణానికి చెందిన న్యాయవాది మనోహర్ రావు ఆన్లైన్ ద్వారా బంగినపల్లి మామిడి పండ్లను బుక్ చేసుకున్నారు. శుక్రవారం తాండూరు ఆర్టీసీ డీపో ద్వారా మేనేజర్ పి. ఆండాలు ఆధ్వ‌ర్యంలో మనోహర్ రావు నివాసానికి చేరుకుని మామిడి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైనా మామిడి పండ్ల‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను ఆర్డర్ చేసుకుంటే ఇంటింటికి డెలివరీ సేవలను అందిస్తామన్నారు. ఆస‌క్తి గ‌ల‌వారు www.tsrtcparcel.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. 5 కేజీలకు రూ. 581లు, 10 కేజీలకు రూ.1120లు చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సేవ‌ల‌ను ప్ర‌జ‌లు, ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నవీన్ గౌడ్, బాలప్ప, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.