schedule Friday, September 11, 2026

714 జీఓను రద్దు చేయాలి

calendar_today May 18, 2022
person dharshininews
714 జీఓను రద్దు చేయాలి
714 జీఓను రద్దు చేయాలి - 20న‌ ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నా - టీఆర్ఎస్‌కేవీ తాండూరు అధ్యక్షులు కె. గోపాల్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్టంలోని 714 జీఓ వాహ‌న దారుల‌కు శాపంగా మారింద‌ని, దానిని వెంట‌నే రద్దుచేయాలని టీఆర్ఎస్‌కేవీ(కార్మిక విభాగం) తాండూరు నియోజక వర్గం అధ్యక్షులు కె.గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు లారీ ఓన‌ర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ప్ర‌భుత్వం తీసుక‌వ‌చ్చిన జీఓ నెంబ‌ర్ 714కు వ్య‌తిరేకంగా ఈనెల 20న తాండూరు ఆర్టీఏ కార్యాలయం ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకవచ్చిన ఈ జీఓతో రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ల రెన్యూవల్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ముందే డీజీల్ ధ‌ర‌ల భారంతో బాధ‌ప‌డుతున్న వాహ‌న‌దారుల‌కు ఈ జీఓ శాపంగా మారుతుంద‌న్నారు. కావున కేంద్రం తీసుకవచ్చిన జీటను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 20న చేపట్టే ధర్నాలో వాహనదారులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భగవాన్ కరీం, ప్రధాన కార్యదర్శి ముస్తఫా పటేల్, కోశాధికారి నర్సింహారెడ్డి, సభ్యులు సాబేర్, గఫ్ఫార్, నజీమ్, శంషోద్దీన్, అహమ్మద్, ఇర్ఫాన్, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.