schedule Saturday, September 12, 2026

రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

calendar_today May 21, 2022
person dharshininews
రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి - వర్ధంతిలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలనీ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రభాకర్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశం సాంకేతిక రంగంలో దూసుకుపోతుందంటే రాజీవ్ గాంధీ కృషే కారణమన్నారు. అట్టడుగు ప్రజల ఆభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు మరోవైపు రాజీవ్ కాలనీకి చెందిన 30 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ వారిని కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డెలిగేట్ సభ్యులు సర్దార్ఖాన్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, నాయకులు నవాజ్, ఎన్ఎస్ యూఐ జిల్లా వర్కింగ్ ఎసిడెంట్ అంకిత్, తాండూరు అధ్యక్షులు సందీప్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..