schedule Saturday, July 04, 2026

అక్రమ కేసులను భయపడేది లేదు

calendar_today May 24, 2022
person dharshininews
అక్రమ కేసులను భయపడేది లేదు
అక్రమ కేసులను భయపడేది లేదు - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అక్రమ కేసులకు ఎప్పటికి భయపడేది లేదని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. గత ఆరు నెలల క్రితం డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దర్నా నిర్వహించారు. అప్ప‌ట్లో ఈ ధర్నాలో పాల్గొన్న నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ఎన్ఎస్ యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ తదితరులు తాండూరు న్యాయస్థానంలో కేసు విచార‌ణ‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఎన్ఎస్ యూఐ నాయకులు ఉన్నారు.