schedule Friday, July 10, 2026

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ గౌడ్

calendar_today May 24, 2022
person dharshininews
డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ గౌడ్
డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ గౌడ్ - బాధ్యతలను అప్పగించిన లక్ష్మీనారాయణ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు కొత్త డీఎస్పీగా జి. శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తాండూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఇక్క‌డి నుంచి బదిలీపై వెళుతున్న‌ లక్ష్మీనారాయణ నుంచి జి. శేఖర్ గౌడ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఖమ్మంలో సీసీఆర్బీ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ గౌడ్ ను తాండూరు డీఎస్పీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం శేఖర్ గౌడ్ తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి లక్ష్మీనారాణకకు పట్టణంలోని నేషనల్ గార్డెన్ లో ఘనంగా వీడొ కులు సమావేశం నిర్వహించారు.