schedule Friday, July 10, 2026

డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసిన కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి

calendar_today May 24, 2022
person dharshininews
డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసిన కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసిన కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నూతన డీఎస్పీ జి. శేఖర్ గౌడ్ ను కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి కలిశారు. మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో నూతన డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసి స్వాగతం పలికారు. అనంతరం మొక్కను అందజేసీ శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో పూర్తి సహకారం అంద జేస్తామని డీఎస్పీ శేఖర్ గౌడ్ తో పేర్కొన్నారు. తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆయన స్థానంలో ఖమ్మంలో సీసీఆర్బీలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ గౌడ్ ను తాండూరు డీఎస్పీగా నియమించగా మంగళవారం శేఖర్ గౌడ్ తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.