schedule Saturday, September 12, 2026

వెల్‌క‌మ్ సార్..!

calendar_today May 24, 2022
person dharshininews
వెల్‌క‌మ్ సార్..!
వెల్‌క‌మ్ సార్..! - డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్‌కు స్వాగ‌తం ప‌లికిన ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు డీఎస్పీగా బ‌దిలీపై వ‌చ్చిన నూత‌న డీఎస్పీ జి.శేఖ‌ర్ గౌడ్‌కు తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆయన స్థానంలో ఖమ్మంలో సీసీఆర్బీలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ గౌడ్ ను తాండూరు డీఎస్పీగా నియమించగా మంగళవారం తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సంద‌ర్భంగా తాండూరు డీఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జి.శేఖ‌ర్ గౌడ్‌కు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. పూల‌మొక్క‌ను బ‌హుమ‌తిగా అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా త‌మ‌రి ఆదేశాల మేర‌కు విధులు నిర్వ‌హిస్తామ‌ని, పూర్తి స‌హాకారం అంద‌జేస్తామ‌ని డీఎస్పీతో పేర్కొన్నారు.