schedule Friday, September 11, 2026

ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ప‌ద్మ‌వ్యూహం..!

calendar_today May 25, 2022
person dharshininews
ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ప‌ద్మ‌వ్యూహం..!
ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ప‌ద్మ‌వ్యూహం..! - నిత్యం ట్రాఫిక్‌తో ఇబ్బందులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ఆర్టీసీ బస్టాండ్ - కోడంగల్ మార్గంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వాహ‌న‌దారుల ప‌ట్ల ప‌ద్మ‌వ్యూహాంగా మారింది. బ్రిడ్జిని త‌లుచుకుంటేనే వాహనదారులు వామ్మో.. అంటు జంకుతున్నారు. నిత్యం ఫ్లైఓవర్ బ్రిడ్జి - ఎ తలెత్తే ట్రాఫ్రిక్ జామ్ పెద్ద తలనొప్పిగా మారింది. మంగళవారం రాత్రి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్ వెళ్లే ప‌రిస్థితి కూడ లేకుండా పోయింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం కూడ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మళ్లీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఫ్లైఓవర్ కు అటు ఇటూ లారీలు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలతో పాటు బైకులు ఒకేసారి రావడంతో దిగ్బందం ఏర్పడింది. వాహనదారులు ముందుకు వెళ్లలేక.. వెనక్కి కదల్లేక అవ‌స్థ‌లు పడ్డారు. అరగంటకు పైగా ఇక్కట్లు పడ్డారు. దీనికి తోడూ మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ పాట్లు పడ్డారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఫ్లైఓవ‌ర్‌పై గుంత‌లు ఏర్ప‌డ‌డంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వాపోతున్నారు.