schedule Friday, July 10, 2026

న్యూజెర్సీకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

calendar_today May 26, 2022
person dharshininews
న్యూజెర్సీకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
న్యూజెర్సీకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - టాటా ఉత్స‌వాల‌లో పాల్గొననున్న‌ ఎమ్మెల్యే - వచ్చేనెల 3న తిరిగి స్వ‌దేశానికి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీకి ప‌య‌న‌మ‌య్యారు. గురువారం రాత్రి ఆయన అమెరికా బయల్దేరారు. ఈనెల 27 నుంచి 29 వరకు అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి 20 మంది రాజకీయ నేతలు టాటా ఉత్సవాలలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీజేపి ఎంపి ధర్మపురి అరవింద్‌ల‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్రిష్ణ, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత ఉన్నారు. టాటా ఆహ్వానంతో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గురువారం ఉత్సవాలలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా అమెరికా బయల్దేరి వెళ్లారు. వచ్చేనెల 3న ఆయన తిరిగి స్వదేశంకు చేరుకుంటారు. ఈ వార్త‌ను స‌మ‌ర్పించింది..