schedule Saturday, July 04, 2026

నకిలీ విత్తనాలు ఎక్కడివి..?

calendar_today May 27, 2022
person dharshininews
నకిలీ విత్తనాలు ఎక్కడివి..?
నకిలీ విత్తనాలు ఎక్కడివి..? - కూపీ లాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు - రుక్మాపూర్ లో 10 కిలోల పట్టివేత పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. అయినా అక్రమార్కులు విక్రయాలు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద నుంచి 10 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనికి ఈ నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడి నుంచి రావాణా చేసున్నాడు..? అనే వివరాలు తెలియరాలేదు. దీంతో టాస్క్ ఫోర్స్, పోలీసులు ఈ విషయాన్ని సీరియసుగా తీసుకున్నారు. లాభ్యమైన నకిలీ విత్తనాల డొంకతో కూపీ మొత్తం లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సాయంత్రానికి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో నకిలీ విత్తనాల విక్రయదారుల్లో గుబులు మొదలైంది.   కింది వరకు చుడండి...