schedule Wednesday, September 09, 2026

10కోట్ల మందికిపైగా ఖాతాలో డ‌బ్బులు

calendar_today May 31, 2022
person dharshininews
10కోట్ల మందికిపైగా ఖాతాలో డ‌బ్బులు
10కోట్ల మందికిపైగా ఖాతాలో డ‌బ్బులు - నేడే పీఎం కిసాన్ నిధి విడుద‌ల‌ ద‌ర్శిని డెస్క్ : కేంద్ర ప్ర‌భుత్వం 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో డ‌బ్బులు చేయ‌నుంది. దేశంలోని రైతుల కోసం కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిపాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) కింద 11వ విడతకు సంబంధించిన రూ. 1.80 లక్షల కోట్లను మే 31వ తేదీన రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బీజేపీ చీఫ్ నడ్డా ప్రకటించారు. మంగళవారం 10కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 10వ విడత జమ కాగా, ఇప్పుడు 11వ విడత నిధులు రేపు జమ కానున్నాయి.. అయితే ఈ డబ్బులు వచ్చిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.