schedule Sunday, September 13, 2026

కుంట మురుగు ఇబ్బందులు దూరం

calendar_today June 18, 2022
person dharshininews
కుంట మురుగు ఇబ్బందులు దూరం
కుంట మురుగు ఇబ్బందులు దూరం - స‌మస్యను పరిష్కరించిన ఆర్డీఓ అశోక్ కుమార్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శనగర్ లోని పాతకుంట మురుగునీటి ప్రవాహానికి ఏర్ప‌డ్డ ఇబ్బందుల ప‌రిష్కారానికి ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కుంటలో మురుగు నీరు ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన వి విషయం తెలిసిందే. దీంతో ఆర్డీఓ అశోక్ కుమార్ పాత కుంటను సందర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ నిర్వహకులు వేసిన పైపులైన్ను తొలగింపు చేయించారు. దీంతో మురుగునీటి పారుద‌ల‌ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు విజయదేవి, పూజ రజనీకాంత్‌లు ఆర్డీఓకు కృతజ్ఞతలు తెలిపారు.