schedule Saturday, September 12, 2026

తాండూరు కోర్టుకు ఎమ్మెల్యే తండ్రి, బాబాయ్

calendar_today June 20, 2022
person dharshininews
తాండూరు కోర్టుకు ఎమ్మెల్యే తండ్రి, బాబాయ్
తాండూరు కోర్టుకు ఎమ్మెల్యే తండ్రి, బాబాయ్ - ఎన్నికల్లో నమోదైన కేసు విచారణకు హాజరు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులోని మున్సిఫ్ కోర్టుకు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి, బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డిలు హాజరయ్యారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విఠల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డిలపై పోలీసు కేసు సమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా వారు సోమవారం తాండూరులోని న్యాయస్థానికి హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం పలువరు నాయకులు వారిని కలిశారు. వారి వెంట టీఆర్ఎస్ తాండూరు కార్మిక విభాగం అధ్యక్షులు, న్యాయవాది గోపాల్, బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ రాజారత్నం నాయకులు నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు ఉన్నారు.