schedule Saturday, September 12, 2026

టీఆర్ఎస్‌తో సంక్షేమం, అభివృద్ధి

calendar_today July 4, 2022
person dharshininews
టీఆర్ఎస్‌తో సంక్షేమం, అభివృద్ధి
టీఆర్ఎస్‌తో సంక్షేమం, అభివృద్ధి - నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్ - సన్మానించిన భవానీ నగర్ మహిళ కార్యకర్తలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమ సాధ్యపుతోందని తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా నియామకం అయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని భవానీ నగర్‌లో స్వరూప శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగర్ గౌడ్ కు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూప, కాలనీ మహిళ కార్య‌క‌ర్త‌లు సాగర్‌ గౌడ్ ను శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం సాగర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్, రైతుబంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర, దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. దీంతో పాటు తాండూరు ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులను ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న టీఆర్ఎస్ ను అందరు ఆదరించాలన్నారు.