schedule Sunday, September 06, 2026

84 ఔష‌దాల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ

calendar_today July 5, 2022
person dharshininews
84 ఔష‌దాల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ
84 ఔష‌దాల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ - తాజా రేట్ల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం ద‌ర్శిని డెస్క్‌: ప్ర‌జ‌లు వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వినియోగించే ప‌లు ఔష‌ధాల ధ‌ర‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. ఇందులో 84 ర‌కాల ఔష‌దాలు ఉన్నాయి. కేవ‌లం ధరల నియంత్రణ జాబితాలో ఉన్న 84 ఔషదాల రిటైల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. నియంత్రిత జాబితాలోని ఔషధాల ధరలను ఫార్మా కంపెనీలు అడ్డగోలుగా పెంచకుండా కళ్లెం వేసేందుకు ఎన్పీపీఏ వాటి ధరల్ని ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది. ఇందులో బీపీ, షుగర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలకు వాడే మందుల‌తో పాటు టైప్-2 మధుమేహ ఉపశమనం కోసం వాడే ఒక్కో వొగ్లిబోస్, మెటాఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్ల ధరలను రూ.10.47గా ఖరారు చేసింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్పీపీఐ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పారాసిటమాల్, కెఫిన్ టాబ్లెట్ల ధర లనూ ఒక్కోటి రూ.2.88గా ఖరారు చేశారు. జ్వరాల నుంచి ఉపశమనం, నరాల ఉత్తేజం కోసం ఈ టాబ్లెట్స్ ఉపయోగి స్తారు. హృదయ సంబంధ సమస్యలకు వినియోగించే రాస్ వాస్టాటిన్ యాస్ప్రిన్, ప్లేట్లెట్లు, బ్లడ్ కాట్స్ ఉపశమనం కోసం వాడే కొపిడోగ్రెల్ ఒక్కో క్యాప్సూల్ ధరను రూ.13.91గా నిర్ణ యించింది. ఈ ధరలకు జీఎసీటీ అదనం. శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు వాడే ఆట్రోవాస్టాటిన్, ఫినోఫైబ్రేట్ టాబ్లెట్ల ధరనూ ఒక్కోటి రూ.13.87గా ఖరారు చేశారు. హృద్రోగులు, బీపీ పేషెంట్లు ఉపయోగించే ఒల్మెసార్టాన్, మెడోక్సోమిల్, ఆమ్లోడిపైన్ టాబ్లెట్ల ధరనూ ఒక్కోటి రూ.12.91గా ఎన్పీపీఏ నిర్ణయించింది.