schedule Friday, July 10, 2026

ఎస్ఎఫ్ఐ తాండూరు మండల క‌మిటి ఎన్నిక‌

calendar_today July 8, 2022
person dharshininews
ఎస్ఎఫ్ఐ తాండూరు మండల క‌మిటి ఎన్నిక‌
ఎస్ఎఫ్ఐ తాండూరు మండల క‌మిటి ఎన్నిక‌ - మండ‌ల అధ్యక్షులుగా బీ. మహేష్ ఏక‌గ్రీవం తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : భారత విద్యార్థి ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్ఎఫ్ఐ) తాండూరు మండల క‌మిటి శుక్ర‌వారం ఎన్నిక‌య్యింది. మండ‌ల‌ అధ్యక్షులుగా బీ.మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టీ. రాజశేఖర్ సమక్షంలో తాండూరు మండల కమిటిని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బీ.మ హేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా సిరియల, నాసిర్, కార్యదర్శిగా ఎండీ మహమూద్, 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై ఎ పోరాటం చేయాలన్నారు. మండల అధ్యక్షులు బీ.మ హేష్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ సహకారంతో వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తానని పేర్కొన్నారు.