schedule Sunday, September 06, 2026

తాండూరు ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్

calendar_today July 17, 2022
person dharshininews
తాండూరు ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్
తాండూరు ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ - 19 న కేర్ ఆసుప‌త్రి మెగా వైద్య శిబిరం - గుండె, మెద‌డు, కీళ్ల స‌మ‌స్య‌ల‌కు ఉచిత ప‌రీక్ష‌లు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం, ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు తాండూరు సాయితరుణ్ ఆసుప‌త్రి వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 19న మంగ‌ళ‌వారం హైదరాబాద్ లోని హైటెక్ సిటి కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్ర‌క‌టించారు. ఆసుప‌త్రికి చెందిన డా.భరత్ పురోహిత్ ద్వారా గుండె సంబధిత వ్యాధులు, డా.సయ్యద్ ఉస్మాన్ ద్వారా నరాల సంబంధిత, మానసిక సమస్యలు, మెదడు, పక్షవాతం వ్యాధులకు, డా.సుధాకర్ రెడ్డి ద్వారా ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని వివరించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.