మీ మైండ్ గేమ్ సాగదు..!
July 3, 2026
dharshininews
మీ మైండ్ గేమ్ సాగదు..!
- 36వార్డులు సమానమనడం బోగస్
- మనసులో ఒకటి, మైండ్‌లో మరో దృష్టి
- ఎంత అభివృద్ధి చేస్తారో చేసి చూపండి
- బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మనసులో ఒకటి, బయటికి మరో వైఖరిని ప్రదర్శిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మైండ్ ఎక్కువ కాలం సాగదని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు.
శుక్రవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పట్టణంలోని 36 వార్డులను సమానంగా చూస్తున్నామని పేర్కొనడం శుద్ద అబద్దమని ఖండించారు. చైర్ పర్సన్ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరో విధంగా వ్యవహరిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ఆమె వైఖరిని బహిర్గతం చేసేందుకు యత్నించడం జరిగిందని చెప్పుకొచ్చారు.
చైర్ పర్సన్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో పార్టీ కౌన్సిలర్ల ముందు తన వార్డుపై చిన్నచూపు చూసే విధంగా నడుచుకున్నారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలను తెలియజేసేందుకే చాంబర్‌లోకి వెళ్లడం జరిగిందని, దీనిని మహిళ చైర్ పర్సన్ అనే పేరును ప్రస్తావిస్తూ చెడుగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. గతం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చైర్ పర్సన్ వార్డును అభివృద్ధి చేసుకున్నారని.. ఇప్పుడు ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
36వార్డులను అభివృద్ధి చేస్తామని మాటలకే పరిమితం చేస్తున్నారే తప్పా ఎక్కడా శ్రద్ద వహించడం లేదని అన్నారు. మూడు నెలల్లో మా వార్డును అభివృద్ధి చేస్తామని గడువు ఇవ్వడం బోగస్ హామి అని విమర్శించారు. కావాలంటే 6నెలల గడువు ఇస్తామని, ఎంత అభివృద్ధి చేస్తారో చేసి చూపాలని సవాల్ విసిరారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న నాయకులు 8వ వార్డు అభివృద్ధి విషయంలో మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. తన వార్డు అభివృద్ధికి ఎంతవరకైనా పోరాటం చేస్తానని, పోరాటంనే వార్డును అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.
https://www.dharshininews.com/43678/