schedule Saturday, July 04, 2026

మరిన్ని విక్టరీలు సాధించు..!

calendar_today July 2, 2026
person dharshininews
మరిన్ని విక్టరీలు సాధించు..!
మరిన్ని విక్టరీలు సాధించు..! - గిన్నిస్‌ రికార్డులో చోటు అభినందనీయం - వినయ్‌ను ప్రసంశించిన బుయ్యని దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గిన్నిస్‌ రికార్డు సాధించిన యువకుడికి మరిన్ని విక్టరీలు సాధించాలని తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళారెడ్డి దంపతులు అభినందించారు. తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భద్రేశ్వర దేవాలయ పూజారి, వీరశైవ సమాజ సర్వ సభ్యులు మడపతి విజయకుమార్ స్వామి కుమారుడు వినయ్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించాడు. గత నెల 13వ తేదీన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ విభాగంలో లదాక్ అనే సరిహద్దుల్లో వుమ్లింగ్ లా అనే ఎత్తయిన శిఖరం(ఎత్తు19024 ఫీట్లు) మైనస్ డిగ్రీ ఆక్సిజన్ లో ఎంతో కఠినాత్మకమైన శిఖరాన్ని అవరోధించాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించి.. అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు వినయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శభాష్ వినయ్ కుమార్ అంటూ అభినందించారు. అదేవిధంగా ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, యువదళ్ సభ్యులు కిరణ్ తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43662/