కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!
November 7, 2026
dharshininews
కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!
- ఆకట్టుకున్న విద్యార్థినుల సురక్షిత దీపావళి సంబరాలు
- ఘనంగా నరకాసుర దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో దీపావళి పండుగ వేడుకలను శనివారం జోష్‌ఫుల్‌గా జరుపుకున్నారు.
పాఠశాల హెచ్‌ఎం, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సార్, డైరెక్టర్ సతీష్ సార్ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా లక్ష్మీపూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థినులు ప్రదర్శించిన 'సురక్షిత, పర్యావరణహిత దీపావళి' నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హాస్యంతో పాటు చక్కని సందేశాన్ని జోడిస్తూ బాణసంచా అధికంగా కాల్చడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పండుగను జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు తరగతుల వారీగా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో బాణసంచా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ సందడితో కళకళలాడింది. అనంతరం హెచ్‌ఎం ప్రశాంత్ సార్ మాట్లాడుతూ.. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని వివరించారు. విద్యార్థులు తమలోని చెడు ఆలోచనలు, ప్రతికూల లక్షణాలను అధిగమించి దయ, నిజాయితీ, కరుణ, సహనం వంటి మంచి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడం మాత్రమే కాదని.. ఆనందాన్ని పంచుకోవడం, పర్యావరణాన్ని కాపాడటం, మంచి విలువలను అలవర్చుకోవడం అని విద్యార్థులు ఈ వేడుకల ద్వారా అందించడం అభినందనీయమని అన్నారు.
https://www.dharshininews.com/45303/