schedule Saturday, November 07, 2026

రేపే దీపావళి..!

calendar_today November 7, 2026
person dharshininews
రేపే దీపావళి..!
రేపే దీపావళి..! - పండుగ నిర్వహణపై తాండూరు హిందూ ఉత్సవ సమితి స్పష్టత - సంప్రదాయంగా జరుపుకోవాలి - సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి: దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తాండూరు హిందూ ఉత్సవ సమితి స్పష్టత ఇచ్చింది. రేపు 8వ తేదీనే ప్రధానంగా దీపావళి పండుగ జరుపుకోవాలని సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్‌ రఘు తెలిపారు. పండుగకు సంబంధించిన ఆచారాలు ఈరోజు, రేపు, ఎల్లుండి కొనసాగుతాయని వివరించారు. నవంబర్‌ 7న నీళ్లు నింపే పండుగ నిర్వహించుకోగా, 8న చతుర్దశి హారతులు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయని తెలిపారు. అనంతరం దీపావళి అమావాస్య సందర్భంగా ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. నవంబర్‌ 9న పాడ్యమి పూజలు ఉంటాయని వెల్లడించారు. దీపావళి పండుగ తేదీపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ వివరాలను వెల్లడించినట్లు బిడ్కర్‌ రఘు తెలిపారు. https://www.dharshininews.com/45295/