ఉపాధ్యాయ నాయకులకు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు
November 7, 2026
dharshininews
ఉపాధ్యాయ నాయకులకు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు
- రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌గౌడ్‌కు పరామర్శ..
- బషీరాబాద్ మండల నూతన కార్యవర్గానికి ఘన సత్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ఉపాధ్యాయ సంఘం నాయకులను కలుసుకుని అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు ఈశ్వర్‌గౌడ్‌ను పరామర్శించారు. ఇటీవల బషీరాబాద్ మండల ఉపాధ్యాయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్, కార్యదర్శిగా ఎన్నికైన భీమప్ప, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన మొగులప్పలను బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.
https://www.dharshininews.com/45305/