అబ్బా.. ఇదేం పనితనం అయ్యా..!
November 7, 2026
dharshininews
అబ్బా.. ఇదేం పనితనం అయ్యా..!
- పైపుల కోసం గుంతలు తవ్వి వదిలేస్తారా..?
- నెల రోజులుగా స్థానికుల అవస్థలు
- 9వ వార్డులో మిషన్ భగీరథ పనితీరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మిషన్ భగీరథ పనులు చేపట్టిన సిబ్బంది రోడ్లను తవ్వి పైపులు పరిచారు.. కానీ తిరిగి గుంతలను పూడ్చడం మాత్రం మరిచిపోయారు.
తాండూరు సాయిపూర్ 9వ వార్డులోని కట్టమైసమ్మ సమీపంలో నెలరోజుల క్రితం చేపట్టిన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో హనుమాన్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైపుల ఏర్పాటు కోసం తవ్విన రోడ్డును అలాగే వదిలేయడంతో కాలనీలో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడం, తవ్విన గుంతలను పూడ్చకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన పనులు.. వారికే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, రోడ్డును పునరుద్ధరించి కాలనీవాసుల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
https://www.dharshininews.com/45293/