ఆటోలో రేషన్ బియ్యం..!
November 7, 2026
dharshininews
ఆటోలో రేషన్ బియ్యం..!
- పట్టుకోగానే వ్యాపారుల పరార్
- పట్టణంలోని సాయిపూర్‌లో ఘటన
- పోలీసులకు ఆటో అప్పగింత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేషన్ దుకాణాల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శనివారం తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ ఆటోను స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు పట్టుకోవడంతో ఆటోను అక్కడే వదిలేసి వ్యాపారులు పరారయ్యారు. గత మూడు నెలలుగా రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోగా, ఈ నెల మొదటి తేదీ నుంచి తిరిగి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
దీంతో కొందరు అక్రమ వ్యాపారులు పేదల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయిపూర్ ప్రాంతంలో ఓ ఆటోలో బియ్యం తరలిస్తుండటాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు.
ఆటోను అడ్డుకుని నిలదీయడంతో అందులో ఉన్న వ్యాపారులు వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇందులో సుమారు 2 క్వింటాళ్ వరకు బియ్యం ఉన్నట్లు అనుమానం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆటోను పోలీసులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు.
https://www.dharshininews.com/45297/