schedule Saturday, November 07, 2026

అక్కా చెల్లెళ్లకు ఆనందం పంచిన బీఎస్ఆర్‌..!

calendar_today November 7, 2026
person dharshininews
అక్కా చెల్లెళ్లకు ఆనందం పంచిన బీఎస్ఆర్‌..!
అక్కా చెల్లెళ్లకు ఆనందం పంచిన బీఎస్ఆర్‌..! - తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి వేడుకలు - ఏడాది క్రితం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ స్వీట్లు, ఆర్థిక సాయం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: తల్లిదండ్రులను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు దీపావళి పండుగ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అండగా నిలిచారు. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన భవాని, శివలీల అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిని పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి వారి చదువు, భవిష్యత్తుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటను మరువకుండా దీపావళి సందర్భంగా శనివారం మరోసారి చిన్నారుల వద్దకు వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వీట్ల బాక్స్‌తో పాటు కొంత ఆర్థిక సహాయం అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కొంతసేపు గడుపుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. కష్టకాలంలో ఇచ్చిన భరోసాను ఏడాది గడిచినా గుర్తుంచుకుని, పండుగ వేళ చిన్నారులను కలుసుకుని ఆర్థికంగా అండగా నిలవడంపై గ్రామ పెద్దలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45299/