అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
July 2, 2026
dharshininews
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
- జాప్యానికి తావులేకుండా పూర్తి చేయాలి
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- పంచాయతీ, తాగునీటి శాఖ అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, రూరల్ వాటర్ సప్లై (ఇంట్రా అండ్ గ్రిడ్) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రామపంచాయతీ భవనాలు, ఎస్‌హెచ్‌జీ భవనాలు, స్కూల్ ప్రహరీ గోడలు తదితర పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశం లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, రూరల్ వాటర్ సప్లై శాఖ అధికారులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43668/