schedule Saturday, July 04, 2026

చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య

calendar_today July 4, 2026
person dharshininews
చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య

చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య - వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు - పాల్గొన్న చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతాంగా సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్యను చరిత్ర ఎన్నటికీ మరువదని పలువురు నేతలు గుర్తుచేసుకున్నారు. శనివారం తంఆడూరు పట్టణంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని యశోధ నగర్ పార్కులో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు రాజు గౌడ్, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, కురుమ సంఘం నాయకులు హాజరై దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడుగా చరిత్రలో నిలిచారని అన్నారు. భూస్వామ్య దోపిడి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కురుమ సంఘంతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదిరులు పాల్గొన్నారు.

https://www.dharshininews.com/43681/