schedule Sunday, September 13, 2026

అమ్మ‌వార్ల‌కు ఆషాఢ‌ శోభ‌

calendar_today July 17, 2022
person dharshininews
అమ్మ‌వార్ల‌కు ఆషాఢ‌ శోభ‌
అమ్మ‌వార్ల‌కు ఆషాఢ‌ శోభ‌ - ద‌ర్శించుకున్న చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ - అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆషాఢ మాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని ప‌లు వార్డుల్లో వెల‌సిన అమ్మ‌వార్ల ఆల‌యాల‌కు శోభ సంత‌రించుకుంది. ఆదివారం పాత తాండూరు అక్కన్న మాదన్న కోటలోని కోట మైసమ్మ, మాణిక్ నగర్లోని మైసమ్మ దేవాల‌యం, మినిట్యాంక్ బండ్ గొల్ల‌చెరువు క‌ట్ట‌పై వెల‌సిన క‌ట్ట మైస‌మ్మ దేవాలయాల్లో ఆషాఢ మాస జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త‌ ఆయా దేవాలయాలను సందర్శించారు. ఆల‌యాల్లో వెల‌సిన అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల‌ర్లు, టీఆర్ఎస్ నాయకులు, భ‌క్తులు తదితరులు ఉన్నారు.