schedule Sunday, September 13, 2026

శాకాంబరీ నమోస్తుతే..!

calendar_today July 22, 2022
person dharshininews
శాకాంబరీ నమోస్తుతే..!
శాకాంబరీ నమోస్తుతే..! - అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ - దర్శించుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆషాడమాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవయాలాల్లో శాకాంబరీ మహోత్సవాలను వైభ‌వంగా నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకానాగ ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలివద్ద వెలసిన రక్తమైసమ్మ, గుమస్తానగర్ లోని రక్తమైసమ్మ దేవాలయంలోని అమ్మవార్లను శాకాంబరీ మాతలుగా అలంకరించారు. ఆలయాల చుట్టు కూరగాయలు, ఆకు కూరలతో స‌ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెహ్రు గంజ్లోని రేణుకానాగ ఎల్లమ్మను ఆలయ మహిళ మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని అన్ని రకాల కూరగాలతో పాటు ఐదు రకాల పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఉదయం నుంచి లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలను నిర్వహించారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆయా దేవాలయాలలో వెలసిన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు భక్తులు కూడ ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.