schedule Monday, September 07, 2026

ప్లాస్టిక్ వినియోగంపై కొర‌డా

calendar_today July 22, 2022
person dharshininews
ప్లాస్టిక్ వినియోగంపై కొర‌డా
ప్లాస్టిక్ వినియోగంపై కొర‌డా - వ్యాపారుల‌కు రూ. 9 వేల జ‌రిమాన‌ - ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టిన సిబ్బంది తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై మున్సిప‌ల్ కొర‌డా జులిపించింది. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హోటళ్లు, స్వీట్ హౌస్లు, బేకరీలలో మున్సిపల్ జవాన్లు తనిఖీలు చేపట్టారు. దాదాపు 12 దుకాణాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 కిలోల వరకు స్వాదీనం చేసుకుని మున్సిపల్ కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ విక్రయాలకు పాల్పడిన దుకాణాల యజమానులకు రూ. 9,200ల‌ వరకు జరిమానాలు విధించారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందని, కావున ప్రజలు, వ్యాపారులు నిషేధిత కవర్లు, వస్తువులను వినియోగించరాదని, లేదంటే జరిమానలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలలో జవాన్లు బొట్టు శ్రీను, సిహెచ్ అశోక్, భూపతి, బాలు, వీరణ్ణలు పాల్గొన్నారు.