schedule Saturday, July 04, 2026

బీజేపీ పాలనలో దేశ పురోగతి

calendar_today July 31, 2022
person dharshininews
బీజేపీ పాలనలో దేశ పురోగతి
బీజేపీ పాలనలో దేశ పురోగతి - వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ పాలనలో భారతదేశం అన్నిరంగాల్లో పురోగతిని సాధిస్తుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్ లోని పోలింగ్ బూతు అధ్యక్షులు శివ నివాసంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ నేతలతో కలిసి మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం చిరువ్యాపారుల స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. దీంతో ఉత్పత్తులు, అమ్మకాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. విపత్తులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా దేశం పురోగతిని సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, యాలాల ఇంచార్జ్ రజనీకాంత్, నాయకులు దోమకృష్ణ, నీరటి రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.