భక్తిశ్రద్దలతో పీర్లపండగ
August 9, 2022
dharshininews
భక్తిశ్రద్దలతో పీర్లపండగ
- పీర్లను దర్శించుకున్న చైర్ పర్సన్ స్వప్న
- వాడల్లో మొహర్రం సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పీర్లపండగ భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి పట్టణంలోని ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి, సాయిపూర్, పాత తాండూరు తదితర ప్రాంతాలలో మొహర్రం వేడకులు సందడిగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం పాత తాండూరులో జరిగిన వేడుకలలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల తదితరులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మసీదులలో కొలువు దీరిన పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్శించుకున్నారు. మరోవైపు మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు పీర్లను పురవీదుల్లో ఊరేగించారు. ప్రజలు కుల, మతాలకు అతీతంగా అలయ్ బలయ్ డప్పుల దరువుల్లో ఆడగా.. మహిళలు ఆశన.. ఊశనాలాల అంటూ పాటలతో ఆడిపాడారు. అనంతరం పీర్లను నిమజ్జనానికి తరలించారు. మొహర్రం వేడుకలలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.